గ్యాంగ్ స్టర్ గా కంప్లీట్ స్టార్..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు హీరో పృధ్వీరాజ్. కొన్నాళ్లుగా హీరో పృధ్వీ దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా మంచి మార్కులు కొట్టేసిన పృధ్వీ ఇప్పుడు దర్శకత్వంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. మోహన్ లాల్ ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం.

తాను డైరెక్టర్ గా పని చేస్తే గనుక మొదటి సినిమా మోహన్ లాల్ తోనే చేస్తానని చాలా కాలం క్రితమే పృధ్వీరాజ్ చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఓ కథను సిద్ధం చేసుకొని మోహన్ లాల్ కు వినిపించి ఒప్పించాడట. ఈ సినిమాకు లూసిఫర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో పృధ్వీరాజ్ కు ఎలాంటి పేరొస్తుందో..
చూడాలి!