బన్నీ కేటరింగ్ బిజినెస్!

బన్నీ కొత్త వ్యాపారం మొదలుపెట్టారని అనుకుంటున్నారా..? కాదండీ.. కేటరింగ్ బిజినెస్ చేసే విషయం వాస్తవమే కానీ అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అల్లు అర్జున్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలనే బన్నీ రోల్ ఉంటుందని అనుకున్నారు.

కానీ ఈ సినిమాలో బన్నీ పౌరోహిత్యం చేయడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన కేటరింగ్ బిజినెస్ చేసే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయం సినిమా ఫస్ట్ లుక్ ను బట్టీ తెలిసిపోతుంది. బన్నీ ఫస్ట్ లుక్ లో కూరగాయల సంచులు తగిలించుకొని రావడం, అన్నపూర్ణ కేటరింగ్స్.. ప్యూర్ వెజిటేరియన్స్ అనే లోగో కూడా ఈ స్కూటర్ పై ఉండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మరి ఈ కేటరింగ్ బిజినెస్ బన్నీ ఎంత పెద్ద హిట్ ఇస్తుందో.. చూడాలి!