HomeTelugu Trending'మిస్‌ శెట్టి- మిస్టర్‌ పోలిశెట్టి' వాయిదా

‘మిస్‌ శెట్టి- మిస్టర్‌ పోలిశెట్టి’ వాయిదా

Miss Shetty Mr Polishetty r
అనుష్క – యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో వస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ప్రకటించనప్పటి నుంచి ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తి నెలకొంది. టీజర్, పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ఆ తేదీకి రావట్లేదని తాజాగా మూవీ యూనిట్‌ వెల్లడించింది.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కావాల్సి ఉంది. అయితే ‘పోస్టు ప్రొడక్షన్’ పనుల్లో ఆలస్యం కారణంగా ఆగస్టు 4వ తేదీన సినిమాను విడుదల చేయలేకున్నాం అని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్‍ను వాయిదా వేశాం. అన్‍లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్మెంట్‍తో అతి త్వరలో ముందుకు వస్తాం. కొత్త రిలీజ్ డేట్, థియేట్రికలల్ ట్రైలర్ డేట్‍ను త్వరలో ప్రకటిస్తాం’ అని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ట్రైలర్‌తో పాటే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‍ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రధన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. చాలా గ్యాప్‌ తరువాత అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu