HomeTelugu Big Storiesప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ.. డైరెక్టర్‌ క్లారిటీ

ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ.. డైరెక్టర్‌ క్లారిటీ

Mission Impossible Director

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇవి కూడా పాన్‌ఇండియా సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్‌ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన హాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సరికొత్త పార్ట్‌లో ఓ కీ రోల్‌ పోషించనున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్ డైరెక్టర్ నుంచి క్లారిటీ వచ్చింది.

ఈ మూవీ డైరెకర్టర్‌ క్రిస్టోఫర్‌కి ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ‘మీరు తెరకెక్కిస్తున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-7’లో ఇండియన్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కీ రోల్‌ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు?’ అని నెటిజన్‌ కోరగా.. ‘ప్రభాస్‌ ఎంతో టాలెంట్‌ కలిగిన వ్యక్తి. కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు’ అని క్రిస్టోఫర్‌ రిప్లై ఇచ్చారు. ఆయన పెట్టిన ట్వీట్‌తో ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu