Namratha Shirodkar nizami dress cost:
వింటర్ వెడ్డింగ్ సీజన్ ప్రారంభమైందని చెప్పాలి. మాజి నటి, మోడల్ నమ్రత శిరోద్కర్ తన తాజా లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ అద్భుతమైన పర్పుల్ అనార్కలి డ్రెస్‌లో కన్పించిన ఫోటోలను షేర్ చేశారు. సంప్రదాయం, ఆధునికత కలగలిపిన ఆమె లుక్ చాలా రాజసంగా ఉంది.
నమ్రత తన పర్పుల్ అనార్కలీ డ్రెస్‌కు సరిపోయేలా హైదరాబాద్ ప్రఖ్యాత ఆభరణం ‘సత్లడ హార్’ ధరించారు. ఇది హైదరాబాద్ రాజ కుటుంబాలకు సంబంధించిన సంప్రదాయ ఆభరణంగా చాలా పాపులర్. సత్లడ సాధారణంగా ఏడు లేయర్లతో ఉంటుంది, కానీ నమ్రత ధరించిన హార్ ఐదు లేయర్లతో రూపొందించబడింది.
View this post on Instagram
ఈ సత్లడ హార్ ను పీఎంజే జువెలర్స్ వారు రూపొందించారు. ఇది స్వచ్ఛమైన బంగారం, ముత్యాల మిశ్రమంతో తయారవుతుంది. దీని ధర సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ రాయల్ లుక్‌ను బడ్జెట్‌లో పొందాలనుకునే వారికి చార్మినార్ లాడ్ బజార్‌లో అనుకూలంగా రూపొందించే సత్లడలు అందుబాటులో ఉన్నాయి.
సత్లడ హార్ అనేక ముత్యాలు, విలువైన రాళ్లతో ఉండే సంప్రదాయ ఆభరణం. హైదరాబాద్ నిజాముల కాలం నుంచి ఇది ప్రసిద్ధి చెందింది. పండగలు, పెళ్లిళ్లలో వరుసగా ఇది మహిళల ఫేవరెట్ ఆభరణంగా చెప్పచ్చు.
నమ్రత ధరించిన డీప్ పర్పుల్ అనార్కలీ సెట్ ప్రముఖ డిజైనర్ జయంతి రెడ్డి డిజైన్. ఈ డ్రెస్ ధర సుమారు రూ. 2.59 లక్షలుగా ఉంది. ఈ సంప్రదాయ డ్రెస్‌తో కూడిన నమ్రత లుక్ మిథిలా మహారాణిలా ఉంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Akhil Akkineni కి తన కాబోయే భార్య Zainab Ravdjee కి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?