HomeTelugu Trendingఅరుదైన వ్యాధితో బాధపడుతున్న కీరవాణి!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న కీరవాణి!

Keeravani suffers from rare
ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.‌ఎం‌. కీరవాణి ‘మల్టిపుల్‌ స్క్లెరోసిస్’ (ఎం.ఎస్) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నానని వివరిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాధి ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చని ఆయన తెలిపారు. ఇది మెదడు, శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని ఆయన చెప్పారు.

దీనిపై ఎంఎస్‌ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని కీరవాణి తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని చెప్పారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu