HomeTelugu Trendingరామ్‌ చరణ్‌తో త్రివిక్రమ్‌!

రామ్‌ చరణ్‌తో త్రివిక్రమ్‌!

Trimikram Movie With Ram Ch
టాలీవుడ్‌ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఏ హీరోతో త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ ప్రశ్నకి సమాధానంగా చరణ్ పేరు వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకరం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. చరణ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసి పెట్టాడట. ఈ కాంబినేషన్‌ కోసం మెగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu