HomeTelugu Trendingఛాన్స్ కోసం వెళ్తే.. బట్టలు విప్పి నిలబడమన్నాడు

ఛాన్స్ కోసం వెళ్తే.. బట్టలు విప్పి నిలబడమన్నాడు

Model paula accuses sajid kమీటూ ఉద్యమంలో భాగంగా సినీరంగంలో తనకు జరిగిన అన్యాయంపై చాలామంది నటీ నటులు బయటకు వచ్చి తమ బాధను వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలావచ్చాయి. తాజాగా ప్రముఖ మోడల్ డింపుల్ పౌలా ఆరోపణలు చేస్తోంది. ‘హౌస్‌ ఫుల్’ సినిమాలో ఒక పాత్ర కోసం సాజిద్ వద్దకు వెళ్లానని, అప్పుడు తన వయసు 17 ఏళ్లని.. ఆ సమయంలోనే తనను లైంగికంగా వేధించాడని పౌలా ఆరోపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టు వైరల్‌ అయింది. మీటూ ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్‌పై ఆరోపణలు చేసేందుకు నాకు ధైర్యం సరిపోలేదు. కుటుంబ పోషణకు నా సంపాదన అవసరం. అందువల్లే ఏమీ చేయలేక ఉండిపోయానంటోంది. సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన తనతో సాజిద్ అసభ్యంగా ప్రవర్తించాడని, గదిలోకి పిలిచిన తన ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలబడమన్నారని ఆరోపించింది. ఇలా ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడో తెలియదు. ఇలాంటి వాళ్లు ఉండాల్సింది సమాజంలో కాదు.. జైల్లో ఉండాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu