రేణుదేశాయ్ ‘పెళ్లిగోల’ బయోపిక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ప్రేమ వివాహం చేసుకున్న రేణు దేశాయ్ కొన్ని కారణాల వలన విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య ఉన్న సంగతి కూడా తెలిసిందే. రేణు నటిగా, దర్శకురాలిగా, రచయితగా అనేక విభాగాల్లో సత్తా చాటారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత పుణెలో ఒంటరిగా ఉంటున్న రేణు రెండేళ్ల క్రితం మరో వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. దాంతో పవన్ ఫ్యాన్స్ చాలామంది రెండో పెళ్లి చేసుకోవద్దంటూ ఆమెను మెసేజ్‌లతో అప్పట్లో చాలా విసిగించారు. కొందరు మద్దతుగా నిలిచినవారూ ఉన్నారు.

తాజాగా తెలుగు బుల్లితెరపై వచ్చేందుకు సిద్ధమైన రేణు దేశాయ్‌ రెగ్యులర్‌గా అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఇప్పటికీ ఆమె రెండో పెళ్లి గురించి మీడియా తరచూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. అభిమానుల్లో కూడా రేణుదేశాయ్ రెండో పెళ్లిపై చాలా ఆసక్తి ఉంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిసారీ తన రెండో పెళ్లి గురించి సమాధానం దాటవేస్తూ వచ్చిన రేణూ ఈసారి తన పెళ్లిపై గట్టిగా సమాధానం ఇచ్చింది.

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. నా పెళ్లిపై మీకెందుకంత ఆసక్తి వదిలేయండి అన్నట్టు రేణు ఎక్స్ ప్రెషన్ పెట్టి ఇ్పప్పటికీ పెళ్లికి సంబంధించి పలువురు నన్ను అడుగుతూనే ఉంటారు. వీళ్ల అనుమానాలు నివృత్తి చేసేందుకు పెళ్లిగోల అనే బయోపిక్ తీస్తానంటూ చమత్కరించింది రేణుదేశాయ్. నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా కొందరికి సమస్యగా ఉంది. బయోపిక్ తీసి క్లారిటీ ఇస్తే సరిపోతుంది అన్నారు. అయినా నా రెండో పెళ్లిపై మీకెందుకు సందేహాలు ఇప్పుడు నేను ఇలా చాలా సంతోషంగానే ఉన్నాను అని అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates