HomeTelugu Big StoriesNarendra Modi: మోడీ బయోపిక్‌ 'విశ్వనేత'

Narendra Modi: మోడీ బయోపిక్‌ ‘విశ్వనేత’

Modi biopic title vishwa ne

Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జీవితం ఆధారంగా ‘విశ్వనేత’ పేరుతో బయోపిక్‌ రానుంది. అన్ని భారతీయ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సి.హెచ్‌.క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు.

వందే మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కాశిరెడ్డి శరత్‌ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్‌ డియోల్‌, నీనా గుప్తా, అనుపమ్‌ఖేర్‌, పల్లవి జోషి ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ప్రముఖ స్వరకర్త కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్నందిస్తున్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు, డీమానిటైజేషన్‌, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి అనేక అంశాలతో ఈ చిత్రాన్ని తెరెక్కించబోతున్నామని, చాయ్ వాలా స్థాయి నుంచి ‘విశ్వనేత’గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని చిత్ర బృందం పేర్కొంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu