HomeTelugu Big Storiesకరోనాపై పోరాడే ఎపిటోప్స్ రూపొందించిన హెచ్‌సీయూ ప్రొఫెసర్

కరోనాపై పోరాడే ఎపిటోప్స్ రూపొందించిన హెచ్‌సీయూ ప్రొఫెసర్

8 27
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ మానవాళిని బిక్కుబిక్కుమనేలా చేసింది. వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అధ్యాపకురాలు సీమా మిశ్రా కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ డిజైన్ రూపొందించినట్లు తెలిపారు. ఈ మేరకు హెచ్‌సీయూ ఓ ప్రకటన
విడుదల చేసింది.

బయో కెమిస్ట్రీ విభాగం ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్‌ సీమా మిశ్రా ఆన్‌లైన్‌లో టీ-సెల్‌ ఎపిటోప్స్‌ను తయారు చేశారు. ఈ ఎపిటోప్స్‌ కరోనాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సీమా మిశ్రా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్‌కు చుట్టూ ఉండే ప్రోటీన్లపై వీటిని ప్రయోగించి నాశనం చేయొచ్చు. అవి కేవలం వైరస్ ప్రోటీన్లపైనే పనిచేస్తాయి, మనిషికి సంబంధించిన ప్రోటీన్లపై దుష్ర్పభావం చూపవని తెలిపారు. అయితే ల్యాబ్స్‌లో చేసే ప్రయోగాల్లో ఎపిటోప్స్ విజయవంతంగా పనిచేస్తే కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ తయారు చేసే వీలుంటుంది. అన్నీ సక్రమంగా జరిగితే టీ-సెల్ ఎపిటోప్స్ సాయంతో పదిరోజుల్లోనే వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. ఎపిటోప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ అధ్యయనాన్ని కెమ్‌రిక్సివ్ అనే జర్నల్‌కు పంపినట్టు సీమా మిశ్రా తెలిపారు. ఆమె పరిశోధనలతో సమర్థవంతమైన కోవిడ్‌ వ్యాక్సిన్ వైపు అడుగులు పడినట్టే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu