HomeTelugu Big Storiesచిరంజీవి సినిమాలో మోహన్‌ బాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన మూవీయూనిట్‌

చిరంజీవి సినిమాలో మోహన్‌ బాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన మూవీయూనిట్‌

8 12
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’152′ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా కనిపిస్తారని వినికిడి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నారని అంటున్నారు.

అయితే ఇటీవల మోహన్ బాబు లుక్ ఒకటి విడుదల చేశారు. చిరంజీవి సినిమాకోసమే ఆ లుక్ అని ప్రచారం కూడా జరిగింది. చిరంజీవి సినిమాలో ఈయన నటించబోతున్నాడు అనగానే అంతా చాలా సంతోషించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ చాలా ఫేమస్. ఇప్పుడు మళ్లీ వారిని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నందుకు ప్రేక్షకులు చాలా ఆనందించారు. అయితే అవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయాయి. ఈ విషయంపై మూవీయూనిట్ సభ్యులు స్పందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదని, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu