HomeTelugu Trending'లూసిఫర్‌' డైరెక్టర్‌ మోహన్‌ రాజ్‌ : చిరంజీవి

‘లూసిఫర్‌’ డైరెక్టర్‌ మోహన్‌ రాజ్‌ : చిరంజీవి

Mohan raja as director for
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫర్’ రీమేక్‌ ‘153వ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన స్క్రిప్టు, ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు. ఓ వైపు ఆచార్య షూటింగ్‌ కొనసాగుతుండగానే, లూసిఫర్‌ రీమేక్‌ పనులతో బిజీ అయ్యారు. సంక్రాంతి తర్వాత ఈ మూవీని సెట్స్‌ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యిందని తెలిపారు. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారని పేర్కొన్నారు. ‘‘రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్టాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్‌కు వెళ‌తాం. ఫిబ్ర‌వ‌రి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu