HomeTelugu Trending‘మర్డర్’ నుంచి మరో పోస్టర్‌ రిలీజ్ చేసిన ఆర్జీవీ

‘మర్డర్’ నుంచి మరో పోస్టర్‌ రిలీజ్ చేసిన ఆర్జీవీ

3 25
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం ‘మర్డర్‌’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్‌ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేస్తూ.. అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు వర్మ. ఈ పోస్టర్‌లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇక ఫాదర్స్‌ డే సందర్భంగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్‌ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుంది’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు.

3a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu