HomeTelugu Trendingకన్నప్పలో మలయాళ స్టార్‌ హీరో!

కన్నప్పలో మలయాళ స్టార్‌ హీరో!

mohanlal plays imortant rol
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈ సినిమా వంద కోట్ల బజ్డెట్‌తో నిర్మించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ సాక్షాత్తు శివుడిగా కనిపించబోతున్నట్లు మంచు విష్ణునే కన్ఫర్మ్‌ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై సినీ లవర్స్‌లో అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అంతేకాక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పార్వతీ దేవిగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార కనిపించబోతున్నట్లు టాక్‌. కాగా తాజాగా ఈ సినిమా కాస్ట్‌లో మరో స్టార్‌ హీరో తోడయ్యాడు.

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ భక్త కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్‌గా మంచు విష్ణు, మోహన్‌లాల్‌ను కలిసాడని.. ఈ మేరకు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి మోహన్‌లాల్‌ కూడా యాడ్ కావడంతో ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా చర్చలు నడుస్తున్నాయి. మహాభారతం టెలివిజన్‌ షోకు దర్శకత్వం వహించిన ముకేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu