హయ్‌ నాన్న: సమయమా సాంగ్‌ ప్రోమో విడుదల


టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30 సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ మూవీ నుంచి సమయమా సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హీరోహీరోయిన్లు ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు.

రేపు ఉదయం 11:07 గంటలకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాటను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. హేశమ్‌ అబ్దుల్ వహబ్ రీసెంట్‌గా ఖుషికి అదిరిపోయే ఆల్బమ్ అందించాడు. హాయ్ నాన్న కోసం మరోసారి సూపర్ హిట్‌ ఆల్బమ్‌తో రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు.

తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్న మూవీలో మృణాళ్‌ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates