HomeTelugu Trending'హాయ్‌ నాన్న' మృణాల్‌ స్పెషల్‌ పోస్టర్‌

‘హాయ్‌ నాన్న’ మృణాల్‌ స్పెషల్‌ పోస్టర్‌

mrunal special poster from
టాలీవుడ్‌లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్‌ ఠాగూర్‌. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ క్యారెక్టర్‌లో ఆమెను తప్ప ఎవరినీ ఊహించుకోని రేంజ్‌లో నటించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో నేచుర్యల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్‌ నాన్న’ ఒకటి.

శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ రోజు మృణాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఆమె స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. గిటారు బ్యాక్‌ వేసుకుని ఉన్న మృణాళ్‌ పోస్టర్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో మృణాళ్‌ గిటార్‌ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఫాదర్ డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అబ్దుల్‌ హేషమ్ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu