HomeTelugu Trendingనమ్రత గారు నా పేరు పెట్టడం మర్చిపోయారు: ఎమ్‌ఎస్‌ రాజు

నమ్రత గారు నా పేరు పెట్టడం మర్చిపోయారు: ఎమ్‌ఎస్‌ రాజు

MS Raju Hurt On mahesh wife

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ మూవీ నిన్నటితో 18 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దీనిని పురస్కరించుకుని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. కాగా, మహేష్ అందులో చిత్ర నిర్మాత ఎంఎస్ రాజుకు భారీ షాకిచ్చింది. ‘ఒక్కడు’ 18 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పిన నమ్రత.. దీనిలో అందరి పేర్లు పెట్టింది కానీ నిర్మాత ఎమ్‌ఎస్ రాజును మర్చిపోయింది. దీంతో ఆయన తన ట్విట్టర్‌లో ‘మహేశ్.. నమ్రత గారు చేసిన పోస్టులో నా పేరును పెట్టడం మర్చిపోయారు. అయినా.. పర్లేదు, ఇది ఆమె క్లాసిక్ సినిమా అని చెప్పినందుకు సంతోషంగా ఉంది’ రాసుకొచ్చారు నిర్మాత ఎంఎస్ రాజు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నమత్ర తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎమ్‌ఎస్ రాజు పేరును చేర్చింది. ఇకపోతే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఎమ్మెస్ రాజు.. ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. సరైన స్క్రిప్ట్ కుదిరితే ‘ఒక్కడు’ చిత్రానికి సీక్వెల్ చేస్తానని ఇటీవల ఎమ్‌ఎస్ రాజు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!