HomeTelugu Trendingహ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ : జాన్వి కపూర్‌

హ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ : జాన్వి కపూర్‌

1 12అతిలోకసుందరి శ్రీదేవి 54వ జయంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది. ఆమె తన తల్లిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ’ అని పోస్ట్‌ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్‌’లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు కూడా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ‘మిమ్మల్ని మిస్సవుతున్నాం మేడమ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌ రూమ్‌ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా, నటి ప్రియాంక చోప్రా తదితరులు కూడా ఆమెతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెట్టారు.

View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu