HomeTelugu Trendingవరుణ్‌ పెళ్లిపై మరోసారి స్పందించిన నాగబాబు

వరుణ్‌ పెళ్లిపై మరోసారి స్పందించిన నాగబాబు

Naga babu respond on varun
మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సోషల్‌ మీడియాలో నెటిజన్లతో షేర్‌ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా నాగబాబుకు ‘వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు?’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పి విసుగెత్తిపోయిన ఈయన ఈ క్వశ్చన్‌కు వరుణ్‌తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు.

కాగా గతంలోనూ వరుణ్‌ అన్న మ్యారేజ్‌ ఎప్పుడు చేస్తారు బాస్‌ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని బదులిచ్చాడు నాగబాబు. మరొకసారైతే వరుణ్‌ ప్రేమ వివాహం చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే వరుణ్‌ ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతుందంటూ ప్రచారం జరగ్గా అది వట్టి పుకారుగానే తేలిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ కూడా కథనాలు రాగా అది కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇక వరుణ్‌ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన ఎఫ్‌3 మే 27న విడుదలవుతుండగా గని ఏప్రిల్‌ 8న విడుదల కానుంది.

naga babu

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!