HomeTelugu Trendingడబ్బింగ్‌ మొదలుపెట్టిన టబు

డబ్బింగ్‌ మొదలుపెట్టిన టబు

8 14
ఒకప్పుడు టాప్ హీరోయిన్ టబు.. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగులో కూడా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. నిన్నేపెళ్లాడుతా, కూలి నెంబర్ 1, అందరివాడు సినిమాలు చేసింది. చివరిగా టబు పాండురంగ మహత్యం సినిమా చేసింది. ఆ తరువాత టబు తెలుగులో సినిమా చేయలేదు. ఇన్నాళ్ల తరువాత టబు తిరిగి అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు సింగిల్స్ విడుదల అయ్యాయి. నాలుగో సింగిల్ రెడీ అవుతున్నది. ఒకవైపు ప్రమోషన్స్ కు సంబంధించిన సాంగ్స్, వీడియోలు రిలీజ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను షురూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను స్టార్ట్ చేసింది. తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది టబు. పాత్ర సినిమాలో కీలకం కానున్నట్టుగా సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu