చై-సామ్‌ల గోవా పార్టీ

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య సమంతతో కలిసి చైతూ గోవాలో తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ వేడుకలో చైతూ స్నేహితులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వేడుక సమయంలో తీసిన కొన్ని ఫొటోలు, వీడియోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సమంత నలుపు రంగు గౌనులో ముస్తాబయ్యారు. ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ..’హోం స్వీట్‌ హోం..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఏడాది క్రితం సమంత, చైతూల వివాహం కూడా గోవాలోనే జరిగింది. కాగా సమంత, చైతూ పెళ్లయ్యాక తొలిసారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో సమంత, చైతూ మధ్యతరగతి భార్యభర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.