HomeTelugu Trending'బంగార్రాజు' : నాగ చైతన్య ఫస్ట్‌లుక్‌

‘బంగార్రాజు’ : నాగ చైతన్య ఫస్ట్‌లుక్‌

Naga chaitanya first look f

‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో నాగార్జున-దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది ఉప శిర్షీక. ఈ సినిమాలో నాగర్జునతో పాటు ఆయన వారసుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అంతేగాక ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగ అప్‌డేట్స్‌ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఓ ఫస్ట్‌సాంగ్‌ విడుదల కాగా.. కృతి శెట్టి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

వీటికి మంచి స్పందన వస్తోంది. ఇక రేపు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ‘బంగార్రాజు’ నుంచి చై లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందంగా. బంగార్రాజు ఫస్ట్‌లుక్‌ అవుట్‌ అంటూ ఈ సందర్భంగా చై పాత్రను వెల్లడించారు. ఇక రేపు(నవంబర్‌ 23) చై పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu