HomeTelugu Big Storiesఅమీర్‌ ఖాన్‌ సినిమాలో నాగచైతన్య.. ఫొటో వైరల్‌

అమీర్‌ ఖాన్‌ సినిమాలో నాగచైతన్య.. ఫొటో వైరల్‌

Naga Chaitanya in Aamir Kha

అక్కినేని యంగ్‌ హీరో నాగ చైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ లో పాల్గొన్న ఓ ఫోటోని షేర్ చేసి చైతూ.. ఈ విషయాన్ని కంఫర్మ్ చేశారు. అమీర్‌ ఖాన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో చైతూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సెట్‌లో శుక్రవారం అడుగుపెట్టాడు నాగ చైతన్య. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌లో దిగిన ఫొటోని పంచుకున్నారు. ఇందులో ఆర్మీ దుస్తుల్లో కనిపించారు చైతూ, అమీర్ ఖాన్‌‌. ప్రస్తుతం ఈ సినిమా తుది షెడ్యూల్‌ని కార్గిల్‌లో చిత్రీకరిస్తున్నారు. 20రోజుల పాటు ఈ షూటింగ్‌ కొనసాగుతుందని చిత్రవర్గాలు తెలిపాయి. అమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 1994లో హాలీవుడ్‌లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి ఇది రీమేక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu