గీతాఆర్ట్స్ లో మరో అవకాశం!

దర్శకుడు పరశురామ్ సోలో, సారోచ్చారు వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించారు. ఇటీవల అల్లు శిరీష్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని తెరకెక్కించారు పరశురామ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో పాటు నటుడిగా శిరీష్ కు మంచి పేరు వచ్చింది. దీంతో అప్పుడే పరశురామ్ గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయాన్ని పరశురామ్ కన్ఫర్మ్ చేశారు. తన పనితనం నచ్చడంతో అల్లు అరవింద్ పిలిచి తనకు అవకాశం ఇచ్చినట్లుగా ఈరోజు పరశురామ్ తన పుట్టినరోజు సంధర్భంగా తెలిపారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయం తెలియాల్సివుంది!