HomeTelugu Trending‘ఏయ్ పిల్లా’ హిట్‌.. శేఖర్ కమ్ములకు నాగచైతన్య గిఫ్ట్‌

‘ఏయ్ పిల్లా’ హిట్‌.. శేఖర్ కమ్ములకు నాగచైతన్య గిఫ్ట్‌

6 14
డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాలోని ప్రేమికుల రోజు సందర్భంగా ‘ఏయ్ పిల్లా’ అంటూ సాగే పాట ప్రివ్యూకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ ప్రివ్యూ ట్రెండింగ్ గా మారింది. విడుదలయిన కాసేపటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవిలపై చిత్రీకరించిన ఈ పాటను నాగార్జున, సమంతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఈ స్పందనకు అటు దర్శకుడు, ఇటు హీరో నాగ చైతన్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శేఖర్ కమ్ములకు నాగ చైతన్య మంచి కళ్లద్దాలను బహుమతిగా అందించి తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, నాగ చైతన్య నుంచి బహుమతి స్వీకరిస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా శేఖర్ కమ్ముల పోస్ట్ చేస్తూ.. ప్రత్యేక బహుమతి అందించినందుకు ధన్యవాదాలు చై. బహుమతితో నన్ను టచ్ చేశావు. తర్వాతి టీజర్ కి ఇంకో బహుమతి సిద్ధం చేసుకో’ అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu