HomeTelugu Trendingహారర్ కంటెంట్ తో అక్కినేని హీరో

హారర్ కంటెంట్ తో అక్కినేని హీరో

Naga chaitanya with horror
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ ‘అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారు. ఇక విక్రమ్ కుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా విభిన్నం గా తెరకెక్కించాలని చూస్తున్నాడు. నిజానికి ‘మనం’ సినిమా తర్వాత ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు విక్రమ్ . ఈ నేపథ్యంలో హారర్ కంటెంట్ తో సినిమాను తెరకెక్కిచనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య ఫస్ట్ టైం హారర్ జోనర్ సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu