HomeTelugu Big Storiesవెంకీ కుడుములతో నాగచైతన్య!

వెంకీ కుడుములతో నాగచైతన్య!

Naga chaitanya with Venky K

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చైతూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించనున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లోని బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రనే ‘లాల్ సింగ్..’ లో చైతన్య పోషించనున్నారని సమాచారం. జూన్ లో లడఖ్ లో జరిగే ఈ సినిమా చివరి షెడ్యూల్ లో ఆయన పాల్గొననున్నారు.

ఇక తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ని లైన్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తోంది. ‘ఛలో’ ‘భీష్మ’ వంటి వరుస హిట్స్ అందుకున్న వెంకీ.. నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వెంకీ మెగా హీరోతో ఓ సినిమా చేయనున్నాడని.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ‘#SSMB28’ కోసం వర్క్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్య తో యువ దర్శకుడు ఓ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu