HomeTelugu Trendingనాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్ ప్రీలుక్‌

నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్ ప్రీలుక్‌

nagarjuna new movie PreLook 1

అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ఈ ప్రీ లుక్ ను విడుదల చేశారు. పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్ తో .. నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని ఆయన వర్షంలో నడుస్తున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ఈ పోస్టర్ ద్వార వెల్లడించారు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP – నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu