
Thandel:
నాగచైతన్య గత మూడు సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. బంగార్రాజు తర్వాత ఆయన చేసిన థ్యాంక్యూ, హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా, అలాగే కస్టడీ.. అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఫలితంగా ఆయన కెరీర్ సంక్షోభంలో పడింది.
ఈ క్రమంలో ఈ హీరో తన ఆశలన్నీ రాబోయే తండేల్ చిత్రంపై పెట్టుకున్నారు. తండేల్ చిత్రం కార్తీకేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. సముద్రంలో జీవించే మత్స్యకారులు అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ బలగాల చేతికి చిక్కిపోవడం, అక్కడి జైళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రధాన కథాంశంగా ఈ సినిమా రూపొందింది. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. నాగచైతన్య సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.
Thandel Pre Release Business
తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు సమాచారం.
– నైజాం – రూ.7 కోట్లు
– సీడెడ్ – రూ.3.5 కోట్లు
– రెస్టాఫ్ ఇండియా – రూ.4 కోట్లు
– ఓవర్సీస్ – రూ.5 కోట్లు
– మొత్తం థియేట్రికల్ బిజినెస్ – రూ.31 కోట్లు
అయితే ఈ సినిమా రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది కాబట్టి, బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.80 కోట్ల థియేట్రికల్ కలెక్షన్స్ రావాలి.
Thandel Non Theatrical Busines
తండేల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది.
– హిందీ డబ్బింగ్ రైట్స్ – రూ.8 కోట్లు
– ఆడియో రైట్స్ – రూ.7 కోట్లు
– శాటిలైట్ రైట్స్ – రూ.10 కోట్లు
– మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ – రూ.65 కోట్లు
థియేట్రికల్ రూ.31 కోట్లు కలిపి, మొత్తం బిజినెస్ రూ.100 కోట్లకు చేరింది. అంటే నిర్మాతకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ సినిమాకు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
– అమెరికా – 128 సెంటర్లలో 252 షోలు, 2,579 టికెట్లు అమ్ముడై $37,490 వసూలు
– కెనడా – 12 సెంటర్లలో 14 షోలు, 64 టికెట్లు అమ్ముడై CAD 1,200 వసూలు
– భారత కరెన్సీలో మొత్తం – రూ.34 లక్షలు
మొదటి షో టాక్ ఎలా ఉంటుంది అనేదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినప్పటికీ, మంచి మౌత్ టాక్ రావాలి. హిట్ అయితే నాగచైతన్యకు మళ్లీ మాస్ మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది.
ALSO READ: నిర్మాతల నుండి Sreeleela కి డేంజర్ సిగ్నల్స్ ఎందుకంటే