HomeTelugu Trendingఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నాడు?

ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నాడు?

11 15
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లు వంటి వారు. అప్పట్లో మద్రాస్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంతో వీరి కృషి అమోఘం. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఎన్నార్ రాజకీయాలవైపు మొగ్గు చూపకుండా .. చివరి శ్వాస వరకు సినిమాలే లోకంగా జీవించారు. ఏఎన్నార్ బయోపిక్ సినిమా గురించే రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత, అక్కినేని కుటుంబం కూడా ఏఎన్నార్ బయోపిక్ ను తెరకెక్కిస్తుందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై అక్కినేని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఏఎన్నార్ నటించిన ఏ సినిమాను రీమేక్ చేసే ఆలోచన చేయలేమని చెప్పారు. అంతేకాదు, బయోపిక్ చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి సాహసానికి పూనుకోబోమని నాగార్జున చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu