HomeTelugu Trending'ఈగల్‌' సెన్నార్‌ పూర్తి

‘ఈగల్‌’ సెన్నార్‌ పూర్తి

Eagle sennar complete

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతి కానుక‌గా (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయ‌నున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈగ‌ల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ (U/A) స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క క‌ట్ కూడా చెప్ప‌క‌పోవ‌డం విశేషం.

అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమా వాయిదా పడనున్నట్లు టాక్‌. ఇప్ప‌టికే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’సినిమాలు థియేట‌ర్‌లు బుక్ చేసుకోగా.. ఉన్న కొన్ని థియేట‌ర్‌ల‌ను ‘హనుమాన్’ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో థయేటర్‌లకు కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఈగ‌ల్ విడుద‌ల అవ్వ‌డం ఆ మూవీకి పెద్ద మైన‌స్ అవుతుందని.. దీనిని వాయిదా వేసుకోవ‌డ‌మే బెట‌ర్ అని సినీ విశ్లేషకుల తెలుపుతున్నారు. ఈ సినిమా కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. డ‌వ్‌జాండ్ సంగీతం అందిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu