HomeTelugu Trendingబిగ్‌బాస్‌కు హ్యాండిచ్చిన నాగార్జున?

బిగ్‌బాస్‌కు హ్యాండిచ్చిన నాగార్జున?

Nagarjuna good bye to Bigg
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 మొదట్లో కాస్త చప్పగా అనిపించినా ఆ తరువాత ఆసక్తికరంగా కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా వీక్షకులకు స్పెషల్ కిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నాగార్జునకు బదులుగా మరో సెలబ్రిటీ ఈ షోని నడిపించబోతున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లి ఇంకా తిరిగి రాలేదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మరికొన్ని వారాలపాటు అక్కడే షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో నాగార్జునను డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయనకు బదులు వేరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేసిందట బిగ్‌బాస్ యాజమాన్యం.

కొద్దిరోజులు హోస్ట్‌గా చేసేందుకు ఎన్టీఆర్, నానితో పాటు నాగచైతన్యను కూడా సంప్రదించగా వారంతా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నామని చెప్పారట. దీంతో రమ్యకృష్ణ వద్దకు ఆ ఆఫర్ వెళ్లిందని తెలుస్తోంది. గత సీజన్‌లోనూ హోస్ట్ నాగార్జున అందుబాటులో లేని సమయంలో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనపై ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ వారం నుంచే బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రత్యేక విమానంలో వచ్చి బిగ్‌బాస్ షూట్ చేసి వెళ్లాలని నాగార్జున భావిస్తున్నట్లుగానూ సమాచారం. ఏది ఏమైనా ఈ వారం ఎపిసోడ్ హోస్ట్ ఎవరనే దానిపై నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి నాగ్‌ ఏం చేస్తాడో!

Bigg boss nagarjuna

Recent Articles English

Gallery

Recent Articles Telugu