HomeTelugu Trending'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌లో నాగ్‌

‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో నాగ్‌

Nagarjuna joins brahmastraటాలీవుడ్‌ హీరో నాగార్జున ప్రస్తుతం చాలా బీజీగా ఉన్నారు. ఓ పక్క కరోనా వ్యాప్తి వున్నప్పటికీ.. అందరూ భయపడుతున్నప్పటికీ నాగ్‌ మాత్రం ‘బిగ్ బాస్-4’ సీజన్‌కి హోస్ట్ గా పనిచేశారు. తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ నిమిత్తం మనాలి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ముంబైలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్టుగా నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఇతర నటులతో కలసి తన కాంబినేషన్ సీన్స్ ఉండడంతో ఈయన కూడా తాజాగా షూట్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నాగార్జున, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్ ల కాంబినేషన్ లో ఈ చిత్రం కోసం అక్కడ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల కావల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu