HomeTelugu Trendingమరోసారి ఖుషి కాంబినేషన్‌ రీపీట్‌

మరోసారి ఖుషి కాంబినేషన్‌ రీపీట్‌

10 14
టాలీవుడ్‌ స్టార్‌ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఖుషి’ ఒకటి. ఇప్పడు చూసినా ఈ సినిమాలో సీన్స్ చాలా ప్లజెంట్‌గా ఉంటాయ్. ఈ సినిమాలోని పవన్ మ్యానరిజమ్స్ ఇప్పటికి యూత్ ఫాలో అవుతుంటారు.ఈ చిత్రంలో భూమిక, పవన్ మధ్య సాగే లవ్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. అప్పట్లో ఈ జోడి మధ్య కెమిస్ట్రీతో చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. 2001లో వచ్చిన అంతటి విజయం తర్వాత కూడా వీరిద్దరూ కలిసి మరో మూవీలో నటించలేదు. అయితే, త్వరలోనే ఈ క్రేజీ జోడి మరోసారి కలిసి కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ పిరియాడికల్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం భూమికను సంప్రాదించాడట క్రిష్. ఆమె కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే..ఖుషి చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం. రత్నంనే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu