HomeTelugu Trendingనందమూరి కల్యాణ్‌ రామ్‌ ఫ్యామిలీ ఫొటో వైరల్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఫ్యామిలీ ఫొటో వైరల్‌

Nandamuri Kalyan Ram Family

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా.. నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాడు. ఇండస్ట్రీలోకి హీరోగా ఆయన అడుగుపెట్టేసి 20 ఏళ్లు అయింది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. కల్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. రెండు కాలాల్లో నడిచే ఈ కథ కోసం ఆయన భారీస్థాయిలో ఖర్చు చేయడం విశేషం.

నిన్న ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్లు .. ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే సందడి చేశాయి. అంతే కాదు బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఆయన దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ‘బింబిసార’ ఆగస్టు 5వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu