HomeTelugu Trendingనాగచైతన్య 'లవ్‌ స్టోరీ' నుండి ఏ పిల్లా .. సాంగ్‌ సూపర్‌..

నాగచైతన్య ‘లవ్‌ స్టోరీ’ నుండి ఏ పిల్లా .. సాంగ్‌ సూపర్‌..

5 10
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని ‘ఏ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా.. రారా కంచే దూకి చకచక ఉరుకుతు..’ అని సాగే గీతాన్ని విడుదల చేశారు. పాటకు పవన్‌ సీహెచ్‌ చక్కటి సంగీతం అందించారు. హరి చరణ్‌, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. చైతన్య, సాయి పల్లవిపై ఈ పాటను చిత్రీకరించారు. వీరీద్దరు మధ్య తరగతికి చెందిన అమ్మాయి, అబ్బాయిగా కనిపించారు. వీరి కెమిస్ట్రీ, ట్యూన్స్‌ యూట్యూబ్‌లో శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.

రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళీ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘వెంకీ మామ’తో ఇటీవల హిట్‌ అందుకున్న నాగచైతన్య ఈ సినిమా తర్వాత పరుశురాం దర్శకత్వంలో నటించబోతున్నారు. సాయిపల్లవి ‘విరాటపర్వం 1922’లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu