ఈగ, మిర్చి లకు నంది అవార్డుల పంట!

కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. రాజమౌళి రూపొందించిన ‘ఈగ’, అలానే కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘మిర్చి’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలకు ఎక్కువ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈగ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్ తో పాటు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు, నటుడు సుదీప్ కు ఉత్తమ ప్రతినాయకుడి అవార్డులు లభించాయి. అలానే మిర్చి సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ప్రభాస్ కు ఉత్తమ హీరో, దర్శకుడు కొరటాలకు ఉత్తమ డెబ్యూట్ అవార్డులు దక్కాయి. అలానే త్రివిక్రమ్, పవన్ ల ‘అత్తారింటికి దారేది’ సినిమా మోస్ట్ పాపులర్ సినిమాగా నిలవడమే కాకుండా త్రివిక్రమ్ కు బెస్ట్ డైలాగ్ రైట్స్ అవార్డ్ దక్కేలా చేసింది. దేవిశ్రీప్రసాద్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ దక్కింది.