HomeTelugu Trendingనాని 'ట‌క్ జ‌గ‌దీష్'

నాని ‘ట‌క్ జ‌గ‌దీష్’

4 2
నేచురల్‌ స్టార్‌ నాని ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట‌ర్‌గా అల‌రించాడు. ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్‌ సినిమాతో మెప్పించి ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. త‌న 26వ చిత్రాన్ని నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో చేస్తున్నాడు నాని. తాజాగా ఈ సినిమాకి ట‌క్ జ‌గ‌దీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసి కొద్ది సేపటి క్రితం విడుద‌ల చేశారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాని 2020లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దాని మీద అయితే క్లారిటీ లేదు. ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. మరో హీరోయిన్‌ గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ను గ్రాండ్‌ గా ప్రారంభించాలి నిర్వహించాలని ప్లాన్‌ చేసినా ఇటీవల జరిగిన దిశ హత్యోదతం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి ఎలాంటి హడావిడి లేకుండా సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu