HomeTelugu Trending'మైఖేల్‌' ఈవెంట్‌కు నాని గెస్ట్‌

‘మైఖేల్‌’ ఈవెంట్‌కు నాని గెస్ట్‌

Nani chief guest for michae

టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మైఖేల్‌’. ఈ నెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంటును రేపు నిర్వహించనున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని చీఫ్ గెస్టుగా హాజరుకానున్న ఈ వేడుకకి, హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.

తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. దివ్యాన్ష కౌషిక్ హీరోయిన్‌గా నటించంది. విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu