HomeTelugu Trendingఓటీటీలోనే నాని 'వి' సినిమా

ఓటీటీలోనే నాని ‘వి’ సినిమా

Nani V movie will release
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ‘వి’ చిత్రం. మార్చి 25న ఈ సినిమా థియేటర్ విడుదల కావలసివుంది. అయితే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు ఇది కూడా ఓటీటీ లో రిలీజ్‌ కానుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. అదితీరావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మేరకు తేదీతో ఓ టీజర్‌ను విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu