ట్విటర్‌లో అభిమాని ఆర్ట్‌.. నాని ప్రశంసలు.. వైరల్‌

తమ అభిమాన హీరోలపైన ఉన్న ప్రేమను ఫ్యాన్స్‌ ఎన్నో రకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇలా వారు తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో వారిలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. తాజాగా నాని అభిమాని ఒకరు తన ప్రతిభతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. జెర్సీ ట్రైలర్‌ను కొత్త రీతిలో మళ్లీ సృష్టించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చివరకు ఆ ఫ్యాన్‌ సృష్టించిన కొత్త ట్రైలర్‌ నాని వరకు చేరింది.

ఆ ట్రైలర్‌ను నాని రీట్వీట్‌ చేస్తూ.. వావ్‌ దిస్‌ ఈజ్‌ ది బెస్ట్ వెర్షన్‌ ఆఫ్‌ జెర్సీ ట్రైలర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. తాను రెండు రోజులు కష్టపడి ఈ బొమ్మలను గీస్తూ.. ట్రైలర్‌ను రీ క్రియేట్‌చేయడానికి కష్టడ్డానంటూ సదరు అభిమాని ట్వీట్‌ చేశారు. మొత్తానికి తాను గీసిన బొమ్మలతో క్రియేట్‌చేసిన ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా.. అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు.