HomeTelugu Trendingప్రభాస్‌ అన్న.. ఇది మన సినిమా: 'సాహో'కి నాని సపోర్ట్‌

ప్రభాస్‌ అన్న.. ఇది మన సినిమా: ‘సాహో’కి నాని సపోర్ట్‌

12 2టాలీవుడ్‌లోబాహుబలి తరువాత వస్తున్న మరో భారీ సినిమా ‘సాహో’. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిడంతో బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

అయితే సాహో విడుదల తేదీ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్‌లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం కూడా ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ తేదీపై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్‌ అన్న, సాహో టీమ్‌కు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్‌ విడుదల తేదీని రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. సాహో మూవీలో ప్రభాస్‌ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu