HomeTelugu Trendingయానిమల్‌: నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ విడుదల

యానిమల్‌: నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ విడుదల

animal
బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్‌. ఈ సినిమాకి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్ నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

తండ్రీకొడుకులైన అనిల్ కపూర్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలతోఎమోషనల్‌ టచ్‌తో సాగుతున్న ఈ పాట అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుందని విజువల్స్ ద్వారా తెలుస్తుంది. అనంత్ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సోను నిగమ్‌ పాడాడు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.

ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈ మూవీపై ఓ రెంజ్‌లో హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu