విశాఖ ఉత్తరం నుండి బరిలో దిగనున్న లోకేష్

లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలూ అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్‌ పెట్టాయి.

ఈ క్రమంలో టీడీపీ హైకమాండ్ కూడా పార్టీ అభ్యర్థులపై స్పీడు పెంచింది. నారా లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతున్నారని స్పష్టం చేసింది. లోకేష్ తొలుత భీమిలి నుండి పోటీచేయాలని పార్టీ హైకమాండ్ భావించినా.. చివరకు విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపుతోంది. తాజా ప్రకటనతో నారా లోకేష్ బరిలోకే దిగే నియోజకవర్గం విషయంలో సస్పెన్స్ వీడింది.