HomeTelugu Trending'నారప్ప' న్యూలుక్‌

‘నారప్ప’ న్యూలుక్‌

Narappa new lookవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’.ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుంది. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఈ సినిమాకు సంబంధించి స‌రికొత్త లుక్ ను విడుద‌ల చేశారు. వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్ లో కేరాఫ్‌ కంచరపాలెం ఫేం కార్తీక్ ర‌త్నం స‌హా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా న‌వ్వుడం చూడొచ్చు. ఈ సినిమా వేసవి విడుదల కానున్నట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu