HomeTelugu Trendingఎన్టీఆర్ బావమరిది మూవీ 'శ్రీశ్రీశ్రీ రాజావారు' ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ బావమరిది మూవీ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఫస్ట్ లుక్

Narne nithiins sri sri sri

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఫస్ట్ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ఈరోజు శ్రీశ్రీశ్రీ రాజావారు ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ను బట్టి చూస్తే నితిన్ ఫస్ట్ మూవీ కోసం మాస్ జోనర్ ను ఎంచుకున్నట్టుగా కన్పిస్తోంది. ఈ పోస్టర్ లో నితిన్ సిగరెట్‌ తాగుతూ కన్పిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జాతరలా కన్పిస్తోంది.

మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ యంగ్ హీరో ఎంట్రీకి కొత్త హీరోయిన్ ను తీసుకుంటున్నారా ? లేక మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకుంటారా? అనేది చూడాలి. శ్రీ వేధాక్షర మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu