HomeTelugu Trendingటైగర్‌ నాగేశ్వరరావు నుండి నాజర్‌ లుక్‌

టైగర్‌ నాగేశ్వరరావు నుండి నాజర్‌ లుక్‌

Nasser look from Tiger Nage
మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమాపై మంచి హోప్స్‌ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేసింది. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. 70,80 ద‌శ‌కాల్లో నాగేశ్వర‌రావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు, దోపిడీలు చేస్తూ పోలీసుల‌కు చిక్కకుండా త‌ప్పించుకునే వాడు. ఇలాంటి గ‌జ‌దొంగ క‌థ బ‌యోపిక్‌గా తెర‌కెక్కుతుండటంతో ప్రేక్షకుల‌లో తీవ్ర ఆసక్తి నెల‌కొంది.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ వరుస అప్డేట్స్‌ ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నాజర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. చెవుల వరకు వీరబోసుకున్న జుట్టు, కోరమీసాలతో నాజర్‌ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో నాజర్‌ గజ్జల ప్రసాద్‌గా కనిపించనున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu