HomeTelugu Trendingసిక్స్‌ ప్యాక్‌తో నేచురల్‌ స్టార్‌!

సిక్స్‌ ప్యాక్‌తో నేచురల్‌ స్టార్‌!

4 7నేచురల్‌ స్టార్‌ నాని ఎక్కువ కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంటాడు. పక్కింటి అబ్బాయి మాదిరిగా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతాడు నాని. అలాంటి నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

నాని తాజా నటిస్తున్న’వి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఆ తరువాత ఆయన శివ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ సినిమాను పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ చేయనున్నాడు. ఈ సినిమాలోనే నాని సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న నాని.. సిక్స్ ప్యాక్ కోసం గట్టిగానే వర్కౌట్స్ చేస్తున్నాడని చెబుతున్నారు. చూస్తుంటే నాని ఈ సారి సాహసమే కాదు .. పెద్ద ప్రయోగం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, లాక్‌డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu