HomeTelugu Trendingనవదీప్ లవ్‌మౌళి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్

నవదీప్ లవ్‌మౌళి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్

Love Mouli song

నవదీప్ చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. ఈ మూవీకి అవనీంద్ర డైరెక్టర్. లవ్ మౌళి చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలోని నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్ ట్రావెలర్‌గా నవదీప్ కనిపించడంతో అభిమానులు ఆశ్యర్యానికి గురయ్యారు. ఢిఫరెంట్ కాన్నెప్ట్‌తో అందర్ని ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత అందించిన ‘ద ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. “అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా? ” అంటూ సాగే పాట అందర్ని ఆకట్టకుంటుంది.

ఈ మూవీలో హీరో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా గోవింద వసంత ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాటను అనీష్ కృష్ణన్ ఆలపించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని మేఘాలయలోని చిరపుంజీలో చేశారు. ఇలాంటి లొకేషన్‌లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu